ర్యాగింగ్‌ కలకలం.. సీరియస్‌గా స్పందించిన మంత్రి హరీష్‌రావు

తెలంగాణలో ఓ కాలేజీ ర్యాగింగ్‌ వ్యవహారం కలకలం రేపుతోంది.. సూర్యాపేట మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిని ర్యాగింగ్‌ చేశారు సీనియర్ విద్యార్ధులు… శనివారం అర్ధరాత్రి సమయంలో కొందరు సీనియర్లు.. బాధిత విద్యార్థి ఒంటిపై ఉన్న దుస్తులను బలవంతంగా తొలగించి ఫొటోలు తీశారు.. జుట్టు కూడా కత్తిరించినట్టు తెలుస్తోంది.. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధిత విద్యార్తి.. హైదరాబాద్‌లోని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని తెలిపాడు.. దీంతో, వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు డయల్ 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు.. ఇక, వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. విద్యార్థిని రక్షించారు.. ఈ ఘటనలో 25 మంది సీనియర్లపై కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు మంత్రి హరీష్‌రావు..

Read Also: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు..? స్పందించిన చీఫ్‌ సెలెక్టర్

సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌ వ్యవహారం తనకు తెలిసిందన్న ఆయన.. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక, ఈ ఘటనపై విచారణ చేయాలని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను ఆదేశించినట్టు వెల్లడించారు.. ఈ రోజు మధ్యాహ్నం వరకు రిపోర్ట్ ఇవ్వాలని కోరాం.. ర్యాగింగ్‌ చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి హరీష్‌రావు.

Related Articles

Latest Articles