ధాన్యం తరలించేందుకు ఇసుక లారీలు స్వాధీనం చేసుకోండి..!

వ‌ర్షాల సీజ‌న్ ప్రారంభ‌మైనందున తూకం వేసిన ధాన్యాన్ని వెంట‌నే మిల్లుల‌కు త‌ర‌లించాల‌ని.. అవ‌స‌రం అయితే, ధాన్యం త‌ర‌లించ‌డానికి ఇసుక లారీల‌ను స్వాధీనం చేసుకోవాల‌ని అధికారుల‌ను సూచించారు మంత్రి హ‌రీష్‌రావు.. సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామంలో వరిలో వెద సాగు పద్ధతిలో సాగుచేస్తున్న రైతులు పొలాన్ని పరిశీలించిన మంత్రి హరీష్ రావు.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రైతును లాభసాటిగా మార్చడమే ధ్యేయంగా అధికారులు పని చేయాల‌న్నారు.. సీఎం కేసీఆర్ తన పొలంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేసి 42 క్వింటాళ్లు దిగుబడి పొందార‌ని.. వెదజల్లే పద్ధతి.. సాగులో రాష్ట్రంలో నెంబరు వన్ ఉండాలని, వరి సాగు చేసే రైతులను ప్రోత్సహించాల‌న్నారు.. ఇక‌, కేంద్రం దొడ్డు రకం కొనమని కొర్రీలు పెట్టింద‌రంర హ‌రీష్‌రావు.. కేరళ మినహా మిగతా చోట్ల దొడ్డు రకం కొనడం లేదు.. సన్న బియ్యంతో రానున్న రోజుల్లో సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంద‌న్నారు..

రైతులు ఆయిల్ ఫామ్ తోటలు పెంపకాన్ని చేప‌ట్టాల‌ని సూచించారు మంత్రి హ‌రీష్‌రావు.. మ‌రోవైపు.. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు.. దేశంలో మ‌రే రాష్ట్రంలో ఇలాంటి ప‌రిస్థితి లేద‌న్నారు.. ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైన రైతుల సంక్షేమం దృష్ట్యా కొనుగోలు చేస్తున్నామ‌న్న ఆర్థిక‌మంత్రి.. వ‌ర్షాల సీజన్ ప్రారంభమైనందున వచ్చే మూడు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోలు, తరలింపును వేగవంతం చేయాల‌న్నారు.. రేపటిలోగా 7 లక్షల గన్ని బ్యాగ్ లను అవసరమైన అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉంచుతాం.. వర్ష సీజన్ ప్రారంభమైనందున తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లుల‌కు తరలించాలి.. ధాన్యం తరలించేందుకు ఇసుక లారీలు స్వాధీనం చేసుకోవాల‌న్నారు మంత్రి హ‌రీష్‌రావు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-