ఈటల తన స్వార్థం కోసమే బీజేపీ పార్టీలో చేరాడు : హరీష్ రావు

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లోని రాచపల్లి గ్రామంలో టీఆరెస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. అసలు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయ్ ఒక్కసారి ఆలోచించాలి. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసాడు చెప్పాలి అన్నారు. మీకు పని చేసే వాళ్ళను గెలిపించండి. ఈటల లేనిపోని మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈటల ఇంతకు ముందు ఏమి చేశాడు ముందటికి ఏమి చేస్తాడో చెప్పి ఓట్లు అడగాలి. దేశంలో ఎక్కడలేని విదంగా పేదింటి ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చింది టీఆరెస్ పార్టీ అని తెలిపారు. ఆనాటి ప్రభుత్వాలు రైతులను ఎరువుల కోసం క్యూ లైన్లో నిలబెట్టాయి. వాన చినుకు పడక ముందే రైతుల ఖాతాలో 5 వేల రూపాయలు వేసింది టీఆరెస్ పార్టీ అని అన్నారు.

ఇక పెట్రోల్ గ్రాస్ డీజిల్ ధరలు పెంచింది బీజేపీ పార్టీ, రైతు బంధు రైతు భీమా ఇచ్చింసి టీఆరెస్ పార్టీ అని గుర్తు చేసారు. ఈటల తన స్వార్థం కోసమే బీజేపీ పార్టీలో చేరాడు. రైతులకు ఇప్పటికే 50 వేల రుణ మాఫీ చేసాం వచ్చే మార్చి లోపు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఇల్లు కట్టియ్యని మంత్రి ఎవరంటే అది ఈటల రాజేందర్ అని అన్నారు. గెల్లు శ్రీనుకు ఒక్క అవకాశం ఇవ్వండి ఇండ్లు కట్టించే బాధ్యత మంత్రిగా నేను తీసుకుంటాను. టన్ టన్ మని కారు గుర్తుకు గుద్దితే ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకుల గువ్వ గుయ్యిమనాలి. రాజేందర్ గెలిస్తే ఆయన ఒక్కడే గడ్డకు పడతాడు. కానీ గెల్లు శ్రీను గెలిస్తే రాచపల్లి గ్రామ ప్రజలు బాగుపడుతారు అని పేర్కొన్నారు.

-Advertisement-ఈటల తన స్వార్థం కోసమే బీజేపీ పార్టీలో చేరాడు : హరీష్ రావు

Related Articles

Latest Articles