ఈటల వ్యాఖ్యలకు గంగుల కౌంటర్.. నా ప్రాణం అడ్డువేస్తా..!

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌.. నా హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించడం సంచలనంగా మారింది.. నన్ను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడు.. హంతక ముఠాతో చేతులు కలిపారని నాకు సమాచారం వచ్చింది. నన్ను నరహంతకుడు నయీం చంపుతా అంటేనే భయపడలేదు.. ఈ చిల్లర ప్రయత్నాలకు ఏనాడూ కూడా భయపడం.. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని అంటూ ఆయన కామెంట్ చేశారు.. అయితే, ఈటల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి గంగుల కమలాకర్‌.. ఈటల రాజేందర్‌ ప్రాణానికి తన ప్రాణం అడ్డువేస్తానన్న ఆయన.. ఈటలపై కుట్ర జరిగితే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని.. మూడు రోజుల్లో రిపోర్టు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక, ఈటల రాజేందర్‌ ఓటమి భయంతో ఉన్నాడని విమర్శించారు మంత్రి గంగుల కమలాకర్‌… ఈటల పాదయాత్రపై సెటైర్లు వేసిన ఆయన.. హుజురాబాద్‌లో
గడియారాల పాద యాత్ర పై ప్రజలు చికొడుతున్నారని ఎద్దేవా చేశారు.. మరోవైపు ఈటల పోటీలో ఉండట్లేదని ఆయన భార్య జమునే అన్నదన్నారు గంగుల.. బీసీ నేతల ఎదుగుదల ఓర్వలేడని ఈటలపై మండిపడ్డ మంత్రి.. తాను బీసీ నేత కావడం వల్లనే తనపై బురద జల్లుతున్నాడని ఆరోపించారు..

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-