కృష్ణా బోర్డు సమావేశం నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్

కృష్ణా బోర్డు సమావేశాన్ని తెలంగాణ అధికారులు వాకౌట్‌ చేశారు. విద్యుత్‌ ఉత్పత్తి పై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య భిన్నాభి ప్రాయాలు వచ్చినట్లు సమాచారాం అందుతోంది. కెఆర్ఎంబి సమావేశంలో జలాల పంపిణీ పై ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల అధికారుల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. 50; 50 అంటూ తెలంగాణ పట్టు పట్టగా… 70; 30 కావాలని ఏపీ ప్రభుత్వం తమ వాదనను వినిపించింది. సాగు, తాగునీటి అవసరం ఉన్నపుడు మాత్రమే శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని కెఆర్ఎంబి చైర్మన్ పేర్కొన్నారు. అయితే..కెఆర్ఎంబి చైర్మన్ నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు… కేఆర్‌ఎంబీ సమావేశాన్ని వాకౌట్‌ చేశారు. కాగా.. గత నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-