కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ మరోలేఖ.. అది ఆపండి..!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది… కృష్ణా న‌దీ యాజమాన్య బోర్డుకు, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు పోటీపడి లేఖలు రాస్తూ వస్తున్నాయి రెండు రాష్ట్రాలు.. తాజాగా, కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం మ‌రో లేఖ రాసింది. కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ ముర‌ళీధ‌ర్ లేఖ రాశారు. ఈ సారి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు విషయాన్ని కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు.. ఏపీ ప్రభుత్వం చేప‌డుతున్న హంద్రీనీవా సుజ‌ల స్రవంతి ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసిన తెలంగాణ ఈఎన్సీ.. ఎలాంటి అనుమ‌తుల్లేకుండానే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విస్తర‌ణ ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచింద‌ని ఫిర్యాదులో పేర్కొన్నది. విస్తర‌ణ ప‌నుల నిలిపివేత‌కు చ‌ర్యలు తీసుకోవాల‌ని విజ్ఞప్తి చేసింది తెలంగాణ.

Related Articles

Latest Articles