ఇంటర్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల.. పరీక్షల విధానంలో కీలక మార్పులు..

కరోనా మహమ్మారి కారణంగా చాలా కాలం ఆన్‌లైన్‌ పాఠాలకే పరిమితయ్యారు విద్యార్థులు.. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు తిరిగి తెరుచుకున్నాయి.. ఇక, 2021-22 విద్యా సంవత్సరాన్ని అకాడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు.. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 220 పని దినాలు ఉండగా.. ఈ సారి పరీక్షల విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. అర్ధ సంవత్సరం, ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆన్‌లైన్‌ తరగతులతో కలిపి విద్యా సంవత్సరంలో మొత్తం 220 పని దినాలుంటాయని తెలిపింది. దసరాకు పండుగకు ఆదివారంతో కలిపి అక్టోబర్‌ 13వ తేదీ నుంచి 16 వరకు సెలవులు ఇచ్చింది. 17న ఆదివారం కాగా.. 18న తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. డిసెంబర్‌ 13 నుంచి 18వ తేదీ వరకు అర్ధ సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది ఇంటర్‌ బోర్డు..

రెండు టర్మ్స్ గా ఇంటర్ అకాడమిక్ ఇయర్ ఉండనుంది.. మొదటి అర్మ్ సెప్టెంబర్ 1 నుండి డిసెంబర్ 18 వరకు కాగా.. అక్టోబర్ 13 నుండి 17 వరకు దసరా సెలవులు.. డిసెంబర్ 13 నుండి 18 వరకు అర్థ సంవత్సరం పరీక్షలు ఉంటాయి.. ఇక, డిసెంబర్ 20 నుండి ఏప్రిల్ 13 వరకు సెకండ్ టర్మ్ ఉండనుంది.. జనవరి 13 నుండి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చిన ఇంటర్‌ బోర్డు.. మార్చి 23 నుండి ఏప్రిల్ 12 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు ఉంటాయని పేర్కొంది.. చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 13 అయితే.. ఏప్రిల్ 14 నుండి మే 31 వరకు వేసవి సెలవులుగా నిర్ణయించింది.. ఈ ఏడాది వంద శాతం సిలబస్ ఉంటుందని.. సిలబస్ లో ఎలాంటి తగ్గింపు లేదని స్పష్టం చేసింది.. దసరా లోపు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనుండగా.. విద్యార్థులు అందరు పరీక్ష రాయాల్సిందే… ఎలాంటి మినహాయింపులు ఉండవని తెలిపింది.. ఇంటర్ అయిపోయిన విద్యార్థులకు ఇంప్రూవ్ మెంట్ రాసుకునే అవకాశం కల్పించింది బోర్డు.

Related Articles

Latest Articles

-Advertisement-