ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు.. ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్లు అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.. రూ. 8 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వారికి ఇకపై ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ వర్తించనుంది.. ఇక, విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై కీలక తీసుకుంది తెలంగాణ ఉన్నత విద్యా మండలి.. ఆగస్టు 24వ తేదీ నుంచి తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు వెల్లడించారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి.. ఆగస్టు 24వ తేదీ నుంచి జరుగుతున్న అడ్మిషన్స్ కౌన్సెలింగ్‌లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు అవుతాయని తెలిపారు.. ఈ సెట్, ఎంసెట్, ఎడ్ సెట్, ఐసెట్, లా సెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ లో ఈ రిజర్వేషన్లు వర్తిస్థాయని.. ఎంసెట్‌లో ఈడబ్ల్యూఎస్‌ ఆప్షన్‌ ఇచ్చిన 16,773 మంది విద్యార్థులు క్వాలిపై అయ్యారని.. ఇంజనీరింగ్‌లో 7,116 మందికి ఈడబ్ల్యూఎస్‌ సీట్లు ఉండే అవకాశం ఉందని.. ఉన్నత విద్యా సంస్థలు అన్నింటిలోనూ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు అవుతాయని వెల్లడించారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి.

Related Articles

Latest Articles

-Advertisement-