కరోనాపై విచారణ: సినిమా థియేటర్లలో చర్యలు ఏంటి..?-హైకోర్టు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. తాజా బులెటిన్‌ ప్రకారం.. 1.14 లక్షలకు పైగా కేసులు ఒకేరోజు నమోదు కావడం కలవరానికి గురిచేస్తోంది.. తెలంగాణలోనూ కోవిడ్‌ మీటర్‌ పైకి దూసుకుపోతోంది.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు.. కోవిడ్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది హైకోర్టు.. కరోనా తీవ్రతపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.. కరోనా తీవ్రత దృష్ట్యా అన్ని రాష్ట్రాల హైకోర్టులు కోవిడ్ నియంత్రణ చర్యలపై మానిటరింగ్ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే కాగా.. రాష్ట్రంలో పరిస్థితిపై ఆరా తీసింది హైకోర్టు..

Read Also: చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారు.. అవసరమైనప్పుడే మాత్రమే..!

బస్ స్టేషన్, రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టులలో విధిగా కోవిడ్ పరీక్షలు చేయాలని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు.. ముఖ్యంగా సినిమా థియేటర్లలో కోవిడ్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది హైకోర్టు.. థియేటర్ల విషయంలో నిబంధనలు కొంత రెగ్యులరైజ్ చేయాలని సూచించింది.. ఇక, కోవిడ్ నియంత్రణ చర్యలపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.

Related Articles

Latest Articles