ఫ్రూట్‌ మార్కెట్‌ కేసు.. నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

బాటసింగారం, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ సమస్యపై అడ్వకేట్ కమిషనర్‌ను నియమించింది తెలంగాణ హైకోర్టు.. ఆ రెండు ఫ్రూట్‌ మార్కెట్లను సందర్శించాలని అడ్వకేట్ కమిషనర్‌ను ఆదేశించింది.. ఫ్రూట్ మార్కెట్ ను సందర్శించి నివేదికను నవంబర్ 19లోగా హైకోర్టు సమర్పించాలని పేర్కొంది.. అయితే, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరఫు న్యాయవాది.. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ బలవంతంగా గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారని కోర్టుకు విన్నవించారు.. ఇక, ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన స్పెషల్ జీపీ సంజీవ్ కుమార్… బాటసింగారం నూతన ఫ్రూట్ మార్కెట్ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కోర్టుకు వివరించారు.. ఇప్పటికే బాటసింగారం వద్ద కమీషన్ ఏజెంట్లు తన స్టాళ్లను ఏర్పాటు చేసుకున్నారని కోర్టుకు తెలిపారు.. బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ ఫొటోలను కోర్టుకు సమర్పించారు.. అయితే, ఈ నెల 19వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని అడ్వకేట్‌ కమిషనర్‌ను ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ నవంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది.

Related Articles

Latest Articles