రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ బాధ్యతగా ఉండాలి…

రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వంతో పాటు… ప్రతి ఒక్కరూ బాధ్యత గా వ్యవహరించాలి అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి గగన్ విహార్ లో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్లిలేట్ అథార్టీ నూతన కార్యాలయాన్ని… అథార్టీ చైర్మన్ జస్టిస్ ప్రకాష్ రావు తో కలిసి హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రారంభించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ… మధ్యప్రదేశ్ లో ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్ గురించి గొప్పగా విన్నానని… మొదటిసారిగా హైదరాబాద్ వచ్చినప్పుడు హుస్సేన్ సాగర్ చూడడానికి వెళ్లానని అక్కడ ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోయాను. హైకోర్ట్ దగ్గర ఉన్న మూసీ నదిని మురుగునీటి కాలువలు అనుకున్నానని… కానీ తన డ్రైనేజీ నది అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. నేను విమానాశ్రయం వేలుతుంటే కొందరు వ్యక్తులు రోడ్డు పక్కనే సంచులలో తీసుకువచ్చి చెత్త ను వేశారని… తన కుమారుడు కారు ఆపి రోడ్డుపై ఉన్న ఆ చెత్త ను చెత్త కుండిలో వేశారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ఐదు సార్లు క్లిన్ సిటీ అవార్డు వచ్చిందని… అక్కడి కలెక్టర్ తో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు మరుగుదొడ్ల పక్కనే ఫుట్ పాత్ పై భోజనం చేశారు. పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రభుత్వంపై బాధ్యత వేయకుండా తిట్టకుండా… ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా ఉండాలి. నదులు, సరస్సులను, పరిసర ప్రాంతాలను కలుషితం చేస్తున్న వారిపై ఈ అథారిటీతో పాటు… పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యత గా ఉండి… కాలుష్య నియంత్రణకు పాటుపడాలని చేతులు జోడించి వేడుకున్నారు చీఫ్ జస్టిస్.

Related Articles

Latest Articles