హుస్సేన్‌సాగర్‌ లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు విచారణ…

హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు విచారణ జరిపింది. హుస్సేన్ సాగర్​లో నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు, నియంత్రణ చర్యలు సూచించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం, గణేష్ ఉత్సవ సమితి, పిటిషనర్ నివేదికలు సమర్పించాలి. కొవిడ్ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అని తెలిపింది. ప్రజల సెంటిమెంట్​ను గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్తితులు కూడా చూడాలి. ఎక్కడికక్కడ స్థానికంగానే నిమజ్జనం చేస్తే బాగుంటుందన్న హైకోర్టు… సామూహిక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా చూడాలి. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకొని ఈ నెల6న తగిన ఆదేశాలు జారీ చేస్తాం అని హైకోర్టు పేర్కొంది.

Related Articles

Latest Articles

-Advertisement-