సెకండ్‌వేవ్‌ అదుపులోకి.. థర్డ్‌ వేవ్‌ పట్ల అప్రమత్తంగా..!

తెలంగాణ కరోనా కేసులు క్రమంగా కిందికి దిగివస్తున్నాయి.. మృతుల సంఖ్య కూడా తగ్గిపోయింది.. ప్రస్తుం కరోనా పరిస్థితులు.. కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలపై స్పందించిన రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు.. రాష్టంలో సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చిందని తెలిపారు.. పాజిటివ్ రేట్ చాలా వరకు తగ్గిందన్న ఆయన.. సీఎం కేసీఆర్‌ గారు రెండు రోజుల క్రితం రివ్యూ చేయడం జరిగింది.. కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో నిన్నటి నుండి రాష్ట్రంలో పర్యటిస్తున్నట్టు తెలిపారు.. ఇక, హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల నేపథ్యంలో కరోనా కేసులు పెరగకుండా ఆరోగ్య సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నామని..మూడో వేవ్ వస్తుందో లేదో తెలియదు.. కానీ, వస్తే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

రాష్టంలో 25 వేల ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉంచామని తెలిపారు శ్రీనివాస్‌రావు.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు సహకరించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరినా ఆయన.. ఇప్పటి వరకు కోటి 25 లక్షల డోసులు ఇచ్చామని.. హైరిస్క్ ఉన్న పీపుల్‌కు 45 లక్షల మందికి వ్యాక్సిన్‌ పూర్తి చేశామని.. ఇక, మూడో ఫీవర్ సర్వే చేశాం.. ఇప్పుడు నాలుగో ఫీవర్ సర్వే ప్రారంభిస్తామని తెలిపారు. సీజనల్ వ్యాధులు చాలా తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్న హెల్త్ డైరెక్టర్.. జాగ్రత్తలు పాటించకపోతే మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.. రాష్ట్రం వ్యాప్తంగా 11 సున్నిత ప్రాంతాలను గుర్తించినట్టు తెలిపారు. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీగా రెండు నుండి రెండున్నర లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామన్న హెల్త్ డైరెక్టర్.. రాష్ట్రంలో దాదాపు యాభై శాతం మందికి మొదటి వ్యాక్సిన్ పూర్తి చేశామని.. ప్రతి రోజూ లక్షకు తగ్గకుండా కరోనా పరీక్షలు చేస్తున్నామన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-