ఆరోగ్యశాఖ హెచ్చరిక: జరా భద్రం…

క‌రోనా సెకండ్ వేవ్‌లో కేసులు త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నా, ఇంకా పూర్తిగా నియంత్రలోకి రాలేదు.  మొద‌టి వేవ్‌లో ఆల్ఫార‌కం వేరియంట్ ఎక్కువ‌గా వ్యాప్తి చెందితే, రెండో ద‌శ‌లో డెల్టావేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంద‌ని, సెకండ్ వేవ్ లో వ్యాప్తి చెందుతున్న ఈ డెల్టా వేరియంట్ కు వ్యాప్తిచెందే గుణం అధికంగా ఉంద‌ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది.  ఇలాంటి స‌మ‌యంలో సెకండ్ వేవ్ తొల‌గిపోయింద‌ని అనుకోవ‌డం పోర‌పాటే అని, త‌ప్ప‌ని స‌రిగా మాస్కులు ధ‌రించాల‌ని తెలియ‌జేసింది.  నిబంధ‌న‌లు ఉల్లంఘించి ప్ర‌వ‌ర్తిస్తే త్వ‌ర‌లోనే మూడోద‌శ కోవిడ్ ముప్పును ఎదుర్కొవాల్సిన ప‌రిస్థితులు వ‌స్తాయ‌ని ఆరోగ్యశాఖ హెచ్చ‌రించింది. భార‌త్‌లో డెల్టావేరియంట్ మొద‌ల‌యి…ప్ర‌పంచంలోని 115 దేశాల‌ను వ‌ణికిస్తోంద‌ని ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రించింది. 

Read: బోనాల పాట.. సింగర్ మంగ్లీపై సీపీకి ఫిర్యాదు

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-