100 కోట్ల టీకాలు.. సంతోషంగా ఉంది : గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ తాను భారతీయురాలిగా గర్వపడుతున్నాను అని తెలిపారు. 100 కోట్లా టీకా డోస్ లు పంపిణీ మార్క్ ని చేరడం సంతోషంగా ఉంది. ఈ విజయం వైద్యులు, మెడికల్ ప్రొఫెషనల్స్ ది, ఈ సందర్భంగా ప్రధాని మోదికి కృతజ్ఞతలు. ఈ విజయంతో అనేక దేశాలు మన వైపు చూస్తున్నాయి. భారత్ లాంటి జనభా ఎక్కువగా వున్న దేశాలు ఇలాంటి విజయం సాధించడం నిజంగా అంత సులభం కాదు. స్వదేశంలో తయారైన వ్యాక్సిన్ లను మనం ప్రజలకు అందించాము. 100 దేశాలకు భారత్ వ్యాక్సిన్ ని అందించింది అని గుర్తు చేసారు.

వ్యాక్సిన్ తయారీలో భాగస్వాములైన సంస్థలను ప్రధాని స్వయంగా సందర్శించి… పరిశోధకులను ప్రోత్సహించారు. వ్యాక్సిన్ తీసుకొని వారే ఎక్కువగా కోవిడ్ తో తీవ్ర ప్రభావాలు ఎదుర్కొంటునట్టు నివేదికలు చెబుతున్నాయి. విడతల వారిగా వ్యాక్సిన్ పంపిని చేయడం కలిసి వచ్చింది. 2 నుంచి 18 ఎల్లా వారికి వాక్సినేషన్ అందించుకునే స్థాయికి చేరాము. 9.47 నిమిషాలకు మనం 100 కోట్ల మార్క్ ని చేరాము. డిజిటల్ గా వాక్సినేషన్ ని రికార్డ్ చేయడం, సర్టిఫికెట్ ఇవ్వడం అందరికి అవగాహన కల్పించడంలో విజయం సాధించాము. భారతీయులు ఏదైనా అనుకుంటే ఎన్ని అవరోధాలు ఎదురైనా విజయం సాధిస్తారని నిరూపించాము. ఇంకా వాక్సిన్ తీసుకొని వారు తప్పక టీకా తీసుకోవాలని కోరుతున్నాను. టీకా తీసుకోవడం ద్వారా దేశాన్ని కాపాడొచ్చు అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles