పవన్ కళ్యాణ్ ను అభినందించిన గవర్నర్‌

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను తెలంగాణ గవర్నర్‌ తమిళి సై అభినందించారు. కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య కు జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేయడాన్ని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై అభినందించారు. కళాకారుడి కి పవన్‌ కళ్యాణ్‌ సాయం అందించడం ఎంతో స్ఫూర్తికరమన్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై. పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్‌ను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై. కాగా… కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య కు నిన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles

-Advertisement-