స్థానిక ప్రజా ప్రతినిధులకు తెలంగాణ సర్కార్‌ బిగ్‌ షాక్‌!

స్థానిక ప్రజా ప్రతినిధులకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపు నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో ….నిర్ణయాన్ని ఉప సంహరించుకున్నట్టు సమాచారం. గౌరవ వేతనాల పెంపునకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు తెలుస్తోంది. అంతకుముందు హైదరాబాద్ సహా ఇతర నగరపాలక సంస్థల మేయర్లు, ఉపమేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యుల గౌరవవేతనాలు పెంచుతూరాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Related Articles

Latest Articles