ప్ర‌భుత్వంతో రేష‌న్ డీల‌ర్స్ చ‌ర్చ‌లు స‌ఫ‌లం

తెలంగాణ రేష‌న్ డీల‌ర్స్‌తో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయ్యాయి.. రేషన్ డీలర్స్ ప్రధాన సమస్యలైన రూ.28 కోట్ల పాత బకాయిలు విడుద‌ల చేసేందుకు సుముఖ‌తం వ్య‌క్తం చేసింది ప్ర‌భుత్వం.. ఇక‌, క‌రోనాతో చనిపోయిన డీలర్స్ కు ఎక్స్ గ్రేషియా, కాంటాకు బ్లూ టూత్ తీసివేయడం, క‌రోనాతో చనిపోయిన డీలర్లకు ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా వారి కుటుంబంలో ఒకరికి డీలర్ షిప్ ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి గంగుల కమలాకర్, కమిషనర్ అనిల్ కుమార్. కాగా, తెలంగాణ‌లోని రేష‌న్ కార్డుదారుల‌కు 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.. క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకోవాడానికి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకోగా.. ఈ నెల 5వ తేదీ నుంచి రేష‌న్ స‌ర‌ఫ‌రా కొన‌సాగ‌నుంది. మ‌రోవైపు.. త‌మ డిమాండ్ల సాధ‌న కోసం సుదీర్ఘంగా పోరాటం చేస్తూ వ‌స్తున్నారు రేష‌న్ డీల‌ర్స్. మొత్తానికి ఇవాళ చ‌ర్చ‌లు విజ‌య‌వంతం అయ్యాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-