బీఎడీ ప్రవేశాలకు కొత్త రూల్స్..

తెలంగాణ‌లో బీఎడ్ కోర్సులో అడ్మిషన్స్ కోసం కొత్త రూల్స్ తెచ్చింది ప్ర‌భుత్వం.. గ‌తంలో ఉన్న నిబంధ‌న‌ల‌కు స‌వ‌ర‌ణ‌లు చేసి ఇవాళ ఉత్త‌ర్వులు జారీ చేసింది స‌ర్కార్.. ఇక‌, బీఎడ్‌ అడ్మిషన్స్‌ పొందాలనుకునే విద్యార్థులు అర్హత కోర్సుల్లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలని స్ప‌ష్టం చేసింది.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం కనీస మార్కులుగా నిర్దేశించారు.. బీఎడ్‌ ఫిజికల్‌ సైన్స్‌ మెథడాలజీలో చేరాలనుకునే వారు డిగ్రీలో ఫిజిక్స్‌ లేదా కెమిస్ట్రీ ఏదేని ఒక్క సబ్జెక్టు చదివి ఉండాల‌ని పేర్కొంది.. గతంలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ రెండు చదివి ఉంటేనే అర్హులుగా పరిగణించేవారు. బయాలజీ మెథడాలజీలో చేరాలంటే బొటనీ లేదా జువాలజీ సబ్జెక్టు ఉంటే అర్హులు అవుతార‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-