వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లు మార్పు.. ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల

ఆ మధ్య వరంగల్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల పేర్లను మార్చనున్నట్టు ప్రకటించారు.. దానికి అనుగుణంగా.. ఇవాళ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం.. వరంగల్ రూరల్ జిల్లాను హనుమకొండ జిల్లాగా.. వరంగల్ అర్బన్ జిల్లాను వరంగల్ జిల్లాగా మారుస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేశారు.. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల గడువు ఇచ్చింది. హనుమకొండ జిల్లాలోకి వరంగల్ జిల్లాలోని మండలాలు… వరంగల్ జిల్లాలోని మండలాలు హనుమకొండ జిల్లాలలోకి… పలు మండలాలు అటు నుండి ఇటు.. ఇటు నుండి అటు మార్చారు.

హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లతో కలిపి హన్మకొండ జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది సర్కార్.. మొత్తం 12 మండలాలు ఈ జిల్లా పరిధిలోకి రానున్నాయి. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం కేంద్రం హన్మకొండ జిల్లా కేంద్రంగా కొనసాగనుంది. హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, ధర్మసాగర్‌, వేలేరు, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్‌, పరకాల, నడికుడ, దామెర మండలాలతో హన్మకొండ జిల్లాను ప్రతిపాదించింది సర్కార్.. ఇక, వరంగల్‌, ఖిలావరంగల్‌, గీసుకొండ, ఆత్మకూరు, శాయంపేట, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెం, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్‌, నెక్కొండ మండలాలు పునర్వ్యవస్థీకరణతో వరంగల్‌ జిల్లా పరిధిలోకి రానున్నాయి. ఇవాళ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల కాగా.. ఎలాంటి అభ్యంతరాలు వస్తాయో.. మార్పులు ఏమైనా జరుగుతాయోమో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-