ప్రజా ప్రతినిధులకు శుభవార్త.. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల వేతనం పెంపు

ప్రజాప్రతినిధులకు మరోసారి గుడ్‌న్యూస్‌ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. పంచాయతీరాజ్‌, స్థానిక సంస్థల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.. 30 శాతం గౌరవ వేతనాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం 10 వేల రూపాయల నుంచి 13 వేల రూపాయలకు పెరిగింది.. అలాగే ఎంపీటీసీలు, సర్పంచుల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.6500కు పెంచుతూ పంచాతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో చాలీచాలని గౌరవ వేతనాలతో ఇబ్బంది పడుతున్న ప్రజాప్రతినిధులు కాస్త ఉపశమనం కలిగినట్టు అయ్యింది.

-Advertisement-ప్రజా ప్రతినిధులకు శుభవార్త.. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల వేతనం పెంపు

Related Articles

Latest Articles