ఆశావర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

ఆశా వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అందించింది. ఆశావర్కర్ల నెలవారీ ప్రోత్సాహకాలను 30శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కింద పనిచేస్తున్న, నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నెలవారీ ప్రోత్సాహకాలతో ఆశావర్కర్ల నెలవారీ జీతం పెరగనుంది.

తెలంగాణ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం మేరకు ఆశావర్కర్లు ఇకపై నెలకు రూ.7,500 జీతం బదులుగా రూ.9,750 అందుకోనున్నారు. గతేడాది జూన్ నుంచి పెంచిన ప్రోత్సాహకాలను అమలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాగా కేసీఆర్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Related Articles

Latest Articles