కరోనా కట్టడిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య మౌళిక సదుపాయాలను బలోపేతం చేయడంపై అధికారులతో బిఆర్ కెఆర్ భవన్ లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య మౌళిక సదుపాయాల అభివృద్ధికై తీసుకున్న చర్యల గురించి ఆరోగ్య శాఖ అధికారులు ప్రధాన కార్యదర్శికి వివరించారు. PSA ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అన్ని పడకలను ఆక్సిజన్ బెడ్ లుగా మార్పు చేయడం, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అదనపు నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, పీడియాట్రిక్ ఆక్సిజన్, ఐసియు బెడ్ ల సంఖ్యను పెంచడం, జిల్లా ఆసుపత్రులను బలోపేతం చేయడం, అప్ గ్రేడ్ చేయడం అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఖాళీగా ఉన్న పోస్ట్ లను త్వరితగతిన భర్తీ చేయాలని, తగినన్నిమందులు నిల్వఉండేలా చూడాలని, డయగ్నోస్టిక్ ఎక్విప్ మెంట్, బయోమెడికల్ పరికరాలు, టెస్టింగ్ కిట్లు, ఇతర నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఏడు కొత్త వైద్య కళాశాలలకు సంబంధించి పురోగతి గురించి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విచారించారు.

Related Articles

Latest Articles

-Advertisement-