తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. వారికి సెలవులు రద్దు..!!

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజుకు దాదాపు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నాలుగు వారాల పాటు ప్రభుత్వ డాక్టర్లు, నర్సుల సెలవులను రద్దు చేసింది. థర్డ్ వేవ్‌కు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను సిద్ధం చేయాలంటూ ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది.

Read Also: ఆశావర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

కాగా తెలంగాణలో మంగళవారం నాడు వెయ్యి కేసులు నమోదు కాగా బుధవారం 1,520 కరోనా కేసులు వెలుగు చూశాయి. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కేసులు పెరిగిన సమయంలో ఆస్పత్రులకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం డాక్టర్లు, నర్సుల సెలవులు రద్దు చేసింది. మరోవైపు వ్యాక్సిన్ సర్టిఫికెట్లు ఉంటేనే ప్రభుత్వ కార్యాలయాల్లోకి రానివ్వాలంటూ త్వరలో ఆదేశాలు రానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను త్వరగా ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 8 నుంచి సెలవులు కావడంతో స్కూళ్లలోనే వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Related Articles

Latest Articles