ప్రైవేటు హాస్పిటల్స్ పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు…

ప్రైవేటు హాస్పిటల్స్ పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసాం అని టీఎస్ హైకోర్టుకు డిహెచ్ తెలిపారు. మొదటి దశ కరోనా సమయంలో ప్రయివేటు హాస్పిటల్స్ నుండి పేషేంట్స్ కు 3 కోట్లు రీ ఫండ్ ఇప్పించాము. ఈ సారి కూడా ప్రయివేటు హాస్పిటల్ లో వసూలు చేసిన వారికి రీ ఫండ్ ఇప్పిస్తాము. నిన్న ఒక హాస్పిటల్ 17 లక్షలు బిల్ వేసింది. మేము చర్యలు తీసుకుని మాట్లాడితే 10 లక్షలు పేషంట్ వారికి రిటర్న్ చేశారు అని పేర్కొన్నారు.

అయితే ప్రైవేటు హాస్పిటల్స్ లో అధిక ధరలపై ఎందుకు ప్రభుత్వం నియంత్రణ చెయ్యడం లేదన్న హైకోర్టు.. ధరల నియంత్రణ కు ఇప్పుడు ఏమైనా జీవో విడుదల చేసిందా అని ప్రశ్నించింది. దాంతో మొదటి దశ లో జీవో విడుదల చేశామని డిహెచ్ పేర్కొన్నారు. అయితే దానిని ఇప్పటికి అమలు చేస్తున్నారా… రెండవ దశ కరోనా సమయంలో ఎందుకు జీవో విడుదల చేయలేదు హైకోర్టు ప్రశ్నించింది. ధరల నియంత్రణ, అధిక ఫీజుల జీవో ఏర్పాటు పై మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు డిహెచ్. ఈ ధరల నియంత్రణ పై ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసి వెబ్సైట్ లో పెట్టాలని హైకోర్టు ఆదేశించింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-