మత్స్యకారులకు భీమా పాలసీ : హరీశ్ రావు

బీజేపీకి ఓటు వేస్తే లాభం జరుగుతుందా.. టీఆర్ఎస్ కి ఓటు వేస్తే లాభం జరుగుతుందా ఆలోచించాలి అని ప్రజల్ని ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు. పని చేసిన వాళ్ళు ఎవరూ.. చేయగలిగేవారు ఎవరు ఆలోచించాలి. కళ్యాణలక్ష్మీని కొంతమంది పరిగెరుకున్నట్లు అని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి త్వరలోనే పెన్షన్ అందుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలను అమాంతం పెంచుతోంది. దొడ్డు వడ్లు కొనమని కేంద్రం చెబుతోంది. వీణవంకలో ఓట్లు అడిగే ముందు బీజేపీ నాయకులు దొడ్డు వడ్లు కొంటామని కేంద్రంతో చెప్పించాలి అన్నారు.

బీజేపీ ఇక్కడ ఏమిచ్చింది.. నోటి మాటలు కాదు మనకు కావాల్సింది. కరోనాలోను ప్రజలను ఆదుకుంది సీఎం కేసీఆర్. సెంటిమెంట్ మాటలు‌ కట్టిపెట్టి గ్యాస్, పెట్రోల్,‌డిజీల్ ధరలు‌ తగ్గించి ఓట్లడగాలి. ఆర్థిక మంత్రి గా నేను మీకు హమీ ఇస్తున్నా. మీ కష్టంలో….సుఖంలో , అండగా ఉంటా. కాళేశ్వరంతో ఎన్ని నీళ్లు వచ్చాయో చూస్తున్నాం అని తెలిపారు.

మత్స్యకారుల కోసం రూ. వెయ్యి కోట్లు సీఎం కేసీఆర్ ఇచ్చారు

ఇక మత్స్యకారుల కోసం రూ. వెయ్యి కోట్లు సీఎం కేసీఆర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ మత్స్యకారుల కోసం మోటార్ సైకిల్లు ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచింది. రూ. 150 కోట్లతో లగేజ్ ఆటోలు ఇచ్చామ్. రూ. 65 కోట్లతో హైదరాబాద్, జిల్లా కేంద్రాలకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వెహికిల్స్ ఇచ్చాము. రాబోయే రోజుల్లో అన్ని మండలాలకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వెహికిల్స్ ఇస్తాం. రూ. 75 కోట్లతో మత్స్యకార భవనాలు మంజూరు చేశారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి చేప పిల్లల డబ్బులు మత్స్యకార సంఘాలకు ఇస్తాం. రేపటి నుంచి అన్ని చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వేసే కార్యక్రమం చేపడుతాము. అలాగే రైతు బీమా తరహాలో మత్స్యకారులకు కూడా రూ. 6 లక్షల భీమా పాలసీ తీసుకొస్తాం అని అన్నారు. ఇక త్వరలోనే 609 జీవో అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. చెరువులు, కుంటలపై మత్స్యకారులకే హక్కు కల్పించేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-