కెసిఆర్ కు తెలంగాణా ఫిలిం ఛాంబర్ కృతజ్ఞతలు

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు తెలంగాణా ఫిలిమ్ ఛాంబర్ కృతజ్ఞతలు తెలిపింది. సినిమా ప్రదర్శనదారులతో కలసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, కె.టి.రామారావు, తలసాని శ్రీనివాసయాదవ్, ఛీప్ సెక్రటరీ సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ కు ఓ లేఖ రాస్తూ తమ అభ్యర్ధన మేరకు సింగిల్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే సౌలభ్యం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. పలు సమస్యల వల్ల థియేటర్లు మూతవేసుకునే పరిస్థితి వచ్చిందని ఇప్పుడు ప్రభుత్వం తమను ఆదుకునేందుకు ముందుకు రావటం ఆనందంగా ఉందని, దీని వల్ల రాష్ట్రంలో సినిమా ప్రేక్షకులకు సేవచేసే అవకాశం కలిగిందంటూ తెలంగాణా ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షుడు కె. మురళీమోహన్ రావు, కార్యదర్శి సునీల్ నారంగ్ అంటున్నారు.

కెసిఆర్ కు తెలంగాణా ఫిలిం ఛాంబర్ కృతజ్ఞతలు
-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-