తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా : కొత్తగా 183 కేసులు

తెలంగాణ కరోనా కేసులు రోజు రోజు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40, 354 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 183 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి.. మరో ఇద్దరు వ్యక్తులు కోవిడ్‌ బారినపడి మృతిచెందాడు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,68,070 కి చేరగా.. రికవరీ కేసులు 6,59,942 కి పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 3932 కు పెరిగిందని.. ప్రస్తుతం రాష్ట్రంలో 4196 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇదే సమయంలో.. 220 కోవిడ్‌ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

-Advertisement-తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా : కొత్తగా 183 కేసులు

Related Articles

Latest Articles