తెలంగాణలో కొత్తగా 306 కరోనా కేసులు..

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే… ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 306 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కాగా… ముగ్గురు మృతి చెందారు.. ఇదే సమయంలో 366 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,59,313 కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,49,757 కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 3883 కు చేరుకుంది.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 69, 422 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు బులెటిన్‌లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ప్రస్తుతం తెలంగాణ లో యాక్టివ్‌ కరోనా కేసుల సంఖ్య 5,673 గా ఉంది.

Related Articles

Latest Articles

-Advertisement-