తెలంగాణ కోవిడ్‌ అప్‌డేట్‌

తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70,974 శాంపిల్స్‌ పరీక్షించగా 315 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఒకేరోజు 318 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్..

దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రంలో చేసిన టెస్ట్‌ల సంఖ్య 2,55,03,276కు చేరగా.. పాజిటివ్‌ కేసులు 6,61,866కు పెరిగాయి.. ఇప్పటి వరకు 6,52,716 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 3,897 మంది ప్రాణాలు వదిలారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,253 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 75 కొత్త కేసులు వెలుగుచూశాయి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-