తెలంగాణ కరోనా అప్‌డేట్.. మరింత కిందకు కేసులు..

తెలంగాణలో కరోనా రోజువారి కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,161 శాంపిల్స్‌ పరీక్షించగా… 187 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మరో కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 170 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,67,158కు చేరుకోగా… రికవరీ కేసులు 6,58,827కు పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 3,925కు చేరినట్టు బులెటిన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,406 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. తాజా, కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 62, కరీంనగర్‌లో 18 కొత్త కేసులు వెలుగు చూశాయి.

-Advertisement-తెలంగాణ కరోనా అప్‌డేట్.. మరింత కిందకు కేసులు..

Related Articles

Latest Articles