తెలంగాణ‌లో త‌గ్గిన క‌రోనా కేసులు.. 93 శాతానికి రిక‌వ‌రీ రేటు

లాక్‌డౌన్ క‌ఠినంగా అమ‌లు చేస్తుండ‌డంతో.. క్ర‌మంగా తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.. ప్ర‌స్తుతం క‌రోనా రిక‌వ‌రీ రేటు 93 శాతంగా ఉంద‌ని ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు తెలిపారు.. రాష్ట్రంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3,614 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 18 మంది క‌రోనాతో మృతిచెందారు.. ఇదే స‌మ‌యంలో 3,961 మంది క‌రోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు.. లాక్‌డౌన్ స‌మ‌యంలో క‌రోనా పాజిటివిటీ రేటు చాలా త‌గ్గింద‌న్న ఆయ‌న‌.. ప్ర‌స్తుతం క‌‌రోనా పాజిటివిటీ రేటు 4 శాతం ఉండ‌గా, మ‌ర‌ణాల రేటు 0.5 శాతంగా ఉంద‌ని తెలిపారు.. మ‌రోవైపు.. ఆస్ప‌త్రుల్లో చేరే క‌రోనా బాధితుల సంఖ్య కూడా త‌గ్గుతుంద‌ని తెలిపారు శ్రీ‌నివాస్‌రావు.. 10 రోజుల్లో బెడ్ ఆక్యుపెన్సీ రేటు 54 శాతం నుంచి 39 శాతానికి ప‌డిపోయింద‌ని.. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గుతున్నాయ‌ని తెలిపారు. లాక్‌డౌన్‌, ఫీవ‌ర్ స‌ర్వేలు మంచి ఫ‌లితాలు ఇస్తున్నాయ‌న్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-