తెలంగాణ కోవిడ్‌ అప్‌డేట్..

తెలంగాణలో క్రమంగా టెస్ట్‌ల సంఖ్య పెరుగుతూ ఉంటే.. రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,29,896 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,813 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది.. కోవిడ్‌ బారినపడి మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఇదే సమయంలో 1801మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. ఇప్పటి వరకు కోవిడ్‌తో మరణించినవారి సంఖ్య 3,426కి చేరుకోగా.. ప్రస్తుతం 24,301 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,96,813కు పెరిగితే.. రికవరీ కేసులు 5,69,086కు చేరాయి. తాజా కేసుల్లో ఖమ్మంలో 180 పాజిటివ్‌ కేసులు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 179 కొత్త కేసులు అత్యధికంగా వెలుగుచూశాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-