తెలంగాణ కోవిడ్ అప్‌డేట్‌.. ఇవాళ ఎన్నికేసులంటే..?

లాక్‌డౌన్ చ‌ర్య‌లు క్ర‌మంగా క‌రోనా కేసులు త‌గ్గేలా చేస్తున్నాయి.. తెలంగాణలో కోవిడ్ కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వ‌హించ‌గా… 2,175 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది.. క‌రోనా బారిన‌ప‌డి మ‌రో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే స‌మ‌యంలో.. 3,821 మంది క‌రోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 30,918 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్ర‌భుత్వం.. కాగా, గ‌త బులెటిన్‌లో 2,261 కొత్త కేసులు వెలుగు చూసిన సంగ‌తి తెలిసిందే.. క్ర‌మంగా రోజురోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య దిగివ‌స్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-