తెలంగాణ‌ క‌రోనా అప్‌డేట్‌..

తెలంగాణ‌లో కోవిడ్ రోజువారి పాజిటివ్ కేసులు క్ర‌మంగా దిగివ‌స్తున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 2,261 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. మ‌రో 18 మంది క‌రోనాతో మృతిచెందారు.. ఇదే స‌మ‌యంలో.. 3,043 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్న‌ట్టు వెల్ల‌డించారు తెలంగాణ ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు.. తాజా లెక్క‌ల‌తో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతానికి త‌గ్గిపోయింద‌ని.. రిక‌వ‌రీ రేటు 99.5 శాతానికి పెరిగంద‌ని పేర్కొన్నారు.. ఇక‌, బెడ్ ఆక్యుపెన్సీ రేటు 26 శాతం మాత్ర‌మే ఉంద‌న్న శ్రీ‌నివాస‌ర్‌రావు.. ఇప్ప‌టి వ‌ర‌కు 87 ల‌క్ష‌ల‌కు పైగా ఇళ్ల‌లో రెండో ద‌శ ఫీవ‌ర్ స‌ర్వే పూర్తి చేశామ‌న్నారు.. మ‌రోవైపు.. గ్రామాల్లోనూ లాక్‌డౌన్ క‌ఠినంగా అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.. గ్రామీణ ప్రాంతాల్లో కేసుల తీవ్ర‌త త‌గ్గించేందుకు ఐసోలేష‌న్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు హెల్త్ డైరెక్ట‌ర్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-