తెలంగాణలో 6 ల‌క్ష‌లు దాటిన కోవిడ్ కేసులు..

తెలంగాణ‌లో క‌రోనా పాజివిటీరేటు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తుంది.. ప్ర‌తీరోజు ల‌క్ష‌కు పైగానే కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నా.. పాజిటివ్ కేసులు మాత్రం రెండు వేల లోపే న‌మోదు అవుతున్నాయి.. తాజాగా ఆ కేసుల సంఖ్య 17 వంద‌ల‌కు చేరువైంది.. రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 1,24,066 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 1707 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది.. మ‌రో 16 మంది కోవిడ్ బారిన‌ప‌డి మృతిచెంద‌గా.. ఇదే స‌మ‌యంలో 2493 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక‌, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6 ల‌క్ష‌ల మార్క్‌ను క్రాస్ చేసి.. 6,00,318కి చేరింది.. రిక‌వ‌రీ కేసులు 5,74,103కి పెరిగాయి.. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో కోవిడ్ బారిన‌ప‌డి మృతిచెందిన‌వారి సంఖ్య 3,456కు పెరిగింది.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 22,759 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్ర‌భుత్వం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-