తెలంగాణ కరోనా అప్‌డేట్‌

తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 691 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కాగా… మరో ఐదుగురు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, కరోనా రికవరీ కేసులు తగ్గుముఖం పట్టాయి… 24 గంటల్లో 565 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,38,721కు చేరుకోగా… పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 6,25,042కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతిచెందినవారి సంఖ్య 3,771కి చేరింది… రాష్ట్రంలో రికవరీ రేటు 97.85 శాతంగా ఉంటే.. దేశంలో 97.33 శాతంగా ఉందని, ఒకేరోజు 1,14,260 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. తాజా కేసుల్లో అత్యధికంగా 85 పాజిటివ్‌ కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదు అయ్యాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-