తెలంగాణలో ఆగని కరోనా ఉధృతి… కొత్తగా 6542 కేసులు…20 మరణాలు 

తెలంగాణలో ఆగని కరోనా ఉధృతి... కొత్తగా 6542 కేసులు...20 మరణాలు 

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  కరోనాను కట్టడి చేసేందుకు నిన్నటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు.  ఇక ఇదిలా ఉంటె, తెలంగాణ ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6,542 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3.67 లక్షలకు చేరింది.  ఇందులో 3.19 లక్షల మంది డిశ్చార్జ్ కాగా, 46,488 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక రాష్ట్రంలో కొత్తగా కరోనాతో 20 మంది మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1876కి చేరింది.  రోజు రోజుకు రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  

Related Articles

Latest Articles