నేడు గవర్నర్ తో భేటీ కానున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు…

ఈ రోజు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై తో భేటీ కానున్నారు కాంగ్రెస్ నేతలు. ఏఐసీసీ పిలుపు మేరకు గవర్నర్ ను కలిసి రాష్ట్రపతి పేరున ఉన్న వినతి పత్రం అందజేస్తారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ లు రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ లు పాల్గొంటారు. దేశంలో కరోనో వ్యాప్తిని అరికట్టడం కోసం ఉచితంగా ప్రతి ఒక్కరికీ వైక్సిన్ వేయాలని, రోజుకు కోటి మందికి వ్యాక్సిన్ వేసి వాక్సి నేషన్ వేగం పెంచాలని, రాష్ట్రంలో కరోనో,బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్స ఉచితంగా చేయాలని, ఇప్పటి వరకు అధికంగా ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించిన డబ్బులను బాధితులకు.ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందించనున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-