రాహుల్‌లో టి.కాంగ్రెస్‌ నేతల భేటీ.. వాటిపైనే ఫోకస్‌..!

తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడు, కొత్త కమిటీల నియామకం తర్వాత తొలిసారి హస్తినబాట పట్టారు నేతలు.. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లిన టి. కాంగ్రెస్‌ నేతలు.. రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఇతర నేతలు హాజరయ్యారు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది.. తెలంగాణలో ప్రజా సమస్యలపై ఆందోళనలు, పార్టీ పటిష్టం కోసం కార్యాచరణపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఈ భేటీకి గీతా రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, అజ్మతుల్లా, అజరుద్దీన్, మధు యాష్కీ గౌడ్, మహేష్ గౌడ్ హాజరయ్యారు. కాగా, రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అధిష్టానంతో సమావేశం కావడం ఇదే మొదటిసారి.. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు నేతల మధ్య గ్యాప్‌ కొనసాగుతూనే ఉంది.. బహిరంగ విమర్శల పర్వం కూడా కొనసాగుతోంది.. ఈ నేపథ్యంలో… రాహుల్‌తో సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

Related Articles

Latest Articles

-Advertisement-