ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ.. ఏం రాశారంటే..?

ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని లేఖలో కోరారు. ఆరేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2016లో హామీ ఇచ్చారని… ఐదేళ్లు గడిచినా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే పరిస్థితి కనిపించడం లేదని లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతాంగం తీవ్ర నష్టాల్లో ఉందని.. ఇలాంటి సమయంలో ఎరువుల ధరలు 50 నుంచి 100 శాతం పెరగడం సరికాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందని… వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని లేఖలో కేసీఆర్ ఆరోపించారు. గత ఐదేళ్లలో ఇన్‌పుట్ కాస్ట్ రెట్టింపు అయినట్లు లేఖలో గుర్తుచేశారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం తప్ప రైతులకు వచ్చిన ఆదాయమేమీ లేదని కేసీఆర్ అన్నారు. ఎరువులపై సబ్సిడీ ఇవ్వాలని దేశంలో కోట్లాది మంది రైతుల తరఫున కోరుతున్నట్లు లేఖలో కేసీఆర్ తెలిపారు. నరేగాతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం పంపినా కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని కేసీఆర్ పేర్కొన్నారు.

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ.. ఏం రాశారంటే..?

Related Articles

Latest Articles