రేపు కూడా ఢిల్లీలోనే కేసీఆర్‌ మకాం..

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. హస్తినలో బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఈ నెల 1వ తేదీన ఢిల్లీ వెళ్లిన ఆయన.. మరుసటి రోజు టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి శంకుస్థాపనలో పాల్గొన్నారు.. ఇక, మరుసటి రోజు.. ప్రధాని మోడీని, ఆ తర్వాత అమిత్‌షాను.. ఇవాళ కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, గజేంద్ర షెకావత్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. రేపు కూడా హస్తినలోనే ఉండనున్నారు సీఎం కేసీఆర్.. ఇప్పటికే ఆరు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ సీఎం.. రేపు మరికొందరు కేంద్ర మంత్రులను కలిసేందుకు.. అక్కడే ఉంటారని తెలుస్తోంది… ఇక, ఎల్లుండి ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు సీఎం కేసీఆర్.

Related Articles

Latest Articles

-Advertisement-