వాసాలమర్రికి సీఎం కేసీఆర్‌.. మీడియాకు నో ఎంట్రీ..!

యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో బుధవారం పర్యటించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.. అయితే, ఈ కార్యక్రమానికి మీడియాకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.. తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రికి ఉదయం చేరుకోనున్న సీఎం.. గ్రామంలో పర్యటించనున్నారు.. రైతు వేదికలో గ్రామస్థులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సుమారు 120 మందితో సమావేశం కానున్నారు.. మొదట ముఖ్యమంత్రి గ్రామంలోని దళిత వాడలో పర్యటిస్తారు.. యాబై మందితో కలిసి దళితవాడను పరిశీస్తారు సీఎం.. ఆ తర్వాత రైతు వేదికలో 120 మంది గ్రామస్తులు, అధికారులతో గ్రామ అభివృద్ధిపై సమీక్ష సమావేశo నిర్వహించనున్నారు.. గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు.. గ్రామస్తులు కోరుకుంటున్నది ఏంటి? అనే దానిపై చర్చ సాగనుంది.. కాగా, ఇప్పటికే అధికారులు పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు.. ఏం చేస్తే బాగుంటుంది అనేదానిపై కసర్తు కూడా చేసినట్టుగా సమాచారం.. పూర్తి వివరాలు, ప్రతిపాదనలను సీఎం ముందు ఉంచనున్నారు. కాగా, ఇప్పటికే ఆ గ్రామంలో పర్యటించిన సీఎం.. గ్రామస్తులతో కలిసి భోజనం కూడా చేసిన సంగతి తెలిసిందే.. అంత కలిసి ముందుకు వెళ్దాం.. గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు కేసీఆర్.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-