ప్రజల హృదయాల్లో సినారె చిరకాలం నిలిచిఉంటారు-కేసీఆర్

భాషా సాహిత్యాలు నిలిచివున్నన్నాళ్లు ప్రజల హృదయాల్లో సినారె చిరకాలం నిలిచివుంటారని స్మరించుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరావ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డా. సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) వర్థంతి సందర్భంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించిన కేసీఆర్.. క‌విగా, రచయితగా, గేయ కావ్య కృతి కర్తగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, సినీ గీతాల రచయితగా, తనదైన ప్రత్యేకశైలిలో తెలంగాణ పద సోయగాలను వొలికిస్తూ సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించిన సృజనకారుడు గుర్తుచేవారు.. ప్రకృతీ మానవ తాత్వికతను ఆవాహనం చేసుకున్న ద్రష్ట, తెలంగాణ జాతికి జ్ఞానపీఠ్ అవార్డును అందించిన సాహితీ స్రష్ట… సినారె అని కొనియాడారు.. దక్కనీ ఉర్దూ తెలుగు భాషా సాహిత్యాలను జుగల్బందీలను చేసి, గజల్స్ తో అలాయ్ బలాయ్ తీసుకొని, తెలంగాణ గడ్డమీద గంగా జమునా తహజీబ్ కు సినారె సాహితీ చిరునామాగా నిలిచారని పేర్కొన్నారు.. దేశీయ అంతర్జాతీయ భాషల్లో, తెలుగు సాహితీ లోకంలో, తెలంగాణ కు ఒక ప్రత్యేకస్థానాన్ని చేకూర్చిన సినారె కృషి అజరామరం అన్నారు సీఎం కేసీఆర్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-