కేంద్ర సర్కార్‌పై కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏదైనా జరగొచ్చు..!

మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రారు.. దళితబంధు పథకంపై అసెంబ్లీలో సుదీర్ఘ వివరణ ఇచ్చిన ఆయన.. ఈ సందర్భంగా వివిధ అంశాలను ప్రస్తావించారు.. కేంద్ర ప్రభుత్వంపై ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ లో మనం శాసించే కేంద్ర ప్రభుత్వం రావొచ్చు అన్నారు.. కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం పడొచ్చు.. లేకపోతే.. ఇప్పుడు ఉన్న కేంద్రమే మనల్ని కనికరించ వచ్చునని కామెంట్ చేశారు.. అనేక దఫాలుగా కేంద్రాన్ని నిధులు కూడా అడిగాం.. మీరు కూడా అడగాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావును ఉద్దేశించిన మాట్లాడిన సీఎం.. దళితుల్లోనే కాదు.. మైనారిటీ, బీసీ, ఓసీల్లో కూడా పేదలు ఉన్నారు.. వాళ్లను కూడా కవర్ చేయాలని.. అన్ని వర్గాలను సమ దృష్టితో చూసే ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ది అన్నారు.

ఇక, ప్రతిదీ ఓటు రూపంలో చూడబోం అన్నారు సీఎం కేసీఆర్… మనిషి కనపడితే ఓటే నా..? అని ప్రశ్నించిన ఆయన.. సామాజిక స్పృహ ఉండాలి కదా? అని మండిపడ్డారు.. దళిత బంధు రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందనే నమ్మకాన్ని వెలిబిచ్చిన సీఎం.. రాజకీయాలకు అతీతంగా అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు నిధులు అందిస్తాం అన్నారు. ఎన్నికల్లో అతను ఎవరికైనా ఓటేసుకొని.. కానీ, ప్రభుత్వ పథకాన్ని అందరికీ వర్తింపజేసేలా ప్రయత్నాలు సాగిస్తాం అన్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీని గురువారానికి వాయిదా వేశారు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. రేపు అసెంబ్లీకి సెలవు కావడంతో… సభ ఎల్లుండికి వాయిదా పడింది.

-Advertisement-కేంద్ర సర్కార్‌పై కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏదైనా జరగొచ్చు..!

Related Articles

Latest Articles