ధాన్యం సేకరణపై వార్షిక క్యాలెండర్ విడుదల చేయాలి : సీఎం కేసీఆర్

తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల పైనే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం పై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరి రైతాంగాన్ని ఇబ్బంది పెరుగుతుంది అని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం సమగ్ర విధానం ప్రకటించాలి అని చెప్పిన సీఎం కేసీఆర్ రైతుల ప్రయోజనాల కోసం పోరాడేందుకు సిద్ధం అని ప్రకటించారు. ఈ విషయంపై కేంద్రాన్ని పార్లమెంటు వేదికగా నిలదీస్తాం అని చెప్పారు. ఉభయసభల్లోనూ మా ఎంపీలు గళమెత్తారు అని అన్న సీఎం కేసీఆర్ వానాకాలం వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రానిది పూటకో మాట అని మండిపడ్డారు. యాసంగిలో వరి ధాన్యం ఎంత కొంటారో చెప్పాలన్న ఆయన ధాన్యం సేకరణపై వార్షిక క్యాలెండర్ విడుదల చేయాలి అన్నారు. అలాగే కేంద్రం వైఖరి వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ధాన్యం సేకరణలో కేంద్రానికి జాతీయ విధానం ఉండాలి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Related Articles

Latest Articles