మార్చిలోపే అన్ని నియోజవర్గల్లో దళిత బంధు.. కానీ,

దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ సర్కార్‌… ఇప్పటికే సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలోని అన్ని దళిత కుటుంబాలకు ఈ నింధులు అందగా… హుజురాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ దళిత బంధు నిధులు విడుదల చేశారు.. ఇదే సమయంలో… రాష్ట్రంలోని మరో నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు మండలాలను కూడా ఎంపిక చేశారు సీఎం కేసీఆర్… అయితే, దళిత బంధుకు నిధులు ఎలా వస్తాయి అనే అనుమానాలు మాత్రం ప్రతిపక్షాలను తొలచివేస్తున్నాయి.. ఈ తరుణంలో దళితబంధుపై అసెంబ్లీ సాక్షిగా సుదీర్ఘ వివరణ ఇచ్చారు సీఎం కేసీఆర్..

దళిత బంధులో ప్రాంతాల వారీగా… వచ్చే సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశామన్న సీఎం కేసీఆర్… నాలుగు ప్రాంతాల నుండి మండలాలు ఎంపిక చేశామని.. ప్రపంచంలోనే ఇలాంటి పథకం అమలు కాలేదన్నారు.. దేశంలోనూ ఇలాంటి ప్రయత్నమే లేదన్న తెలంగాణ సీఎం… మార్చిలోపే అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో నియోజక వర్గంలో 100 మందికి దళిత బంధు నిధులు అందేలా ప్లాన్‌ చేసినట్టు తెలిపారు. ఇక, ముందు ముందు కూడా మేమే వస్తాం .. మాదే అధికారం అని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్… బీజేపీ వచ్చేది లేదు.. సచ్చిదిలేదని సెటైర్లు వేసిన ఆయన.. మాకు అంచనాలు ఉండవా? మాది రాజకీయ పార్టీ కాదా..? మఠం కాదు కదా…? అంటూ ప్రశ్నించారు.

-Advertisement-మార్చిలోపే అన్ని నియోజవర్గల్లో దళిత బంధు.. కానీ,

Related Articles

Latest Articles