తెలంగాణలో తగ్గిన కరోనా తీవ్రత.. 24 గంటల్లో 1006 కేసులు

తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వస్తోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1006 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 613202 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈరోజు కరోనా నుంచి కోలుకున్న వారు 1798 మంది కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,91,870 మంది డిశ్చార్జ్ అయ్యారు.

read more : చిత్తూరు మేయర్‌ అముదపై వైసీపీ శ్రేణుల్లో చర్చ !

ఇప్పటివరకు కరోనాతో 3567 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 17,765 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 87,854 మందికి కరోనా పరీక్షలు చేయడంతో.. ఇప్పటివరకు మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,75,25,639 కు చేరింది. ఇక ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో 149 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-