తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో

తెలంగాణలో కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2524 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 578351 కి చేరింది. ఇందులో 5,40,986 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,084 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 18 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,281 కి చేరింది. కరోనా బులెటిన్ ప్రకారం నిన్న ఒక్కరోజు రాష్ట్రంలో 3,464 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-