నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..లాక్ డౌన్‌లో సడలింపులు ?

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపు, తదితర అంశాల మీదపై కేబినెట్ చర్చించనున్నది. రాష్ట్రంలో ఇవాళ్టితో 18 రోజుల లాక్ డౌన్ ముగియనుంది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో లాక్ డౌన్ నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే వీక్ ఎండ్ లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ వైపు అడుగులు అడుగులు వేస్తోంది ప్రభుత్వం. రాత్రి ఏడు నుంచి కర్ఫ్యూ పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం తెలంగాణలో ప్రస్తుతం 20 గంటల లాక్ డౌన్ అమలులో ఉంది. ఇవాళ జరిగే కేబినెట్ లో లాక్ డౌన్ పొడగింపుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-